ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎంపీ జన్మదిన వేడుకలు

KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బుధవారం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ కేక్ కట్ చేసి నాయకులకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వృద్ధులు, యాచకులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న రేణుక చౌదరి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పేర్కొన్నారు.