జిల్లా గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వెంకటరమణ గౌడ్
NGKL : జిల్లా గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వెంకటరమణ గౌడ్ ఆలేరు గ్రామ వాసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గీత కార్మికుల హక్కుల కోసం పోరాడటం, ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాల సౌకర్యాలు సకాలంలో అందేలా చూస్తానని, తాటి చెట్ల పన్ను మినహాయింపు లేదా సొసైటీల రిజిస్ట్రేషన్ వంటి విషయాల్లో గీత కార్మికులకు అవగాహన కల్పిస్తానని తెలిపారు.