గ్రామ పంచాయతీకి నూతన ట్రాన్స్ ఫార్మర్ మంజూరు

NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలోని కల్వరాల గ్రామ పంచాయతీకి బుధవారం ప్రభుత్వం నూతన ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేసింది. గ్రామ పంచాయతీకి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ లేకపోవడంతో గ్రామస్థులు, స్థానిక నాయకులు ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి స్పందించి నూతన ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయించారు.