కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై నిరసన

SDPT: సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం పాలమాకుల వద్ద మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై నిరసనకు దిగిన పార్టీ శ్రేణులు కేసీఆర్, హరీశ్ రావులకు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.