రైతుల సమస్యను పరిష్కరించిన ఎంపీ
KRNL: గూడూరు మండలం పెంచికలపాడు సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లలో తలెత్తిన సమస్యను ఎంపీ బస్తిపాటి నాగరాజు తక్షణమే పరిష్కరించారు. కాపస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న రైతుల కొనుగోళ్లు నిలిచిపోవడంతో.. ఎంపీ వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి కొనుగోళ్లు పునఃప్రారంభం అయ్యేలా చేశారు. రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.