VIDEO: రాజంపేట జిల్లా కావాలని భారీ ర్యాలీ
అన్నమయ్య: రైల్వే కోడూరులో స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం 1000 మంది విద్యార్థులు 'జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు రాజంపేట ముద్దు' అనే నినాదంతో స్టేట్ బ్యాంకు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టోల్ గేట్ వద్ద మానవహారం చేపట్టి, తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.