కారు బీభత్సం.. వ్యక్తులకు గాయాలు

కారు బీభత్సం.. వ్యక్తులకు గాయాలు

PLD: సత్తెనపల్లి మండలం నందిగామ రోడ్డులో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ముగ్గురు వాహనదారులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.