P4 ఆవశ్యకత గురించి వివరించిన ఎమ్మెల్యే

కృష్ణా: అట్టడుగునున్న కుటుంబాలు, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధికై తోడ్పడాలనే ఆశయంతో తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పీ-4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు చేయూతనివ్వాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. దుబాయ్ పర్యటనలో అక్కడ ప్రవాసాంధ్రలతో బుధవారం సమావేశమయ్యారు. దుబాయిలో వివిధ రంగాల్లో స్థిరపడిన కృష్ణాజిల్లాకు చెందిన వారికి పీ4 ఆవశ్యకత గురించి వివరించారు.