కట్టలేరుకు పెరిగిన వరద.. రాకపోకలు బంద్
NTR: జిల్లా గంపలగూడెం మండలం వినగడప-తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు శనివారం వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధ్వంసమైన వంతెన వద్ద తాత్కాలికంగా నిర్మించిన రహదారిపై భారీ వరద రావడంతో గండి పడిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన రహదారి నిర్మించాలని వారు కోరుతున్నారు.