'జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు'
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 01 నుంచి ఏప్రిల్ 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయని SP నితిక పంత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధమని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.