సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు

కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు, నిబంధనల అమలును పరిశీలించారు. కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తుల జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారదర్శకత కోసమే రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు.