మహానందీశ్వరునికి ఘనంగా పల్లకి ఉత్సవం

మహానందీశ్వరునికి ఘనంగా పల్లకి ఉత్సవం

NDL: మహానంది పుణ్యక్షేత్రంలో మహానందీశ్వరస్వామి దంపతులకు పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువు తీర్చి ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో, మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించారు.