బోరంచ ఆలయంలో హుండీ లెక్కింపు
SRD: మనూరు మండలం బోరంచ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. ఆలయ ఛైర్మన్ మల్లయ్య, ధర్మ కర్తమండలి సభ్యులు, ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. అయితే ఆలయానికి రూ.6,31,832 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పారు. ఇందులో ASI గోవింద్, అర్చకులు ఉన్నారు.