వైభవంగా శ్రీ సత్తెమ్మ తీర్థ మహోత్సవాలు
కోనసీమ: కాట్రేనికోన పంచాయతీ వద్ద ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆదివారం ఉదయం నుంచి వైభవంగా జరుగుతున్నాయి. మండలంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 3000 మందికి అన్నప్రసాద ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.