దారుణం.. పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్లు
AP: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే వారి పట్ల విచక్షణారాహిత్యంతో ప్రవర్తించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులోని విజయ సాయి స్కూల్ టీచర్లు.. క్రమశిక్షణ తప్పారంటూ చిన్నారి విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 'ఫీజులు కట్టేది విద్యాబుద్ధులు నేర్పిస్తారు అనే కానీ అవమానిస్తారని కాదు' అని ఆందోళనకు దిగారు.