భారీగా పెరిగిన ఇంధన ధరలు

భారీగా పెరిగిన ఇంధన ధరలు

ఇంధన ధరలను నేపాల్ ప్రభుత్వం భారీగా పెంచింది. పెట్రోల్ లీటర్‌కు రూ.31లు పెంచింది. దీంతో పెట్రోల్ ధర రూ.188కి చేరింది. అలాగే డీజిల్ ఏకంగా రూ.54 పెరిగి లీటర్ ధర రూ.196కి చేరుకుంది. అంతేకాకుండా LPG సిలిండర్‌పై రూ.296 పెంచడంతో ఒక్కొ సిలిండర్‌ ధర రూ.2,126లకు పెరిగింది. ఈ ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.