ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి

తూ.గో: ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి సూచించారు. ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాల వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోడౌన్‌ను ఆమె శనివారం సందర్శించి అక్కడ పోలీస్ సిబ్బంది చేపడుతున్న భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించారు.