VIRAL VIDEO: తృటిలో తప్పిన ప్రాణాలు
రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతూ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చేందుకు యత్నించాడు. పట్టాలు దాటుతుండగా చెప్పు కింద పడిపోయింది. తిరిగి తీసుకురావడానికి వెనక్కి వెళ్లి వస్తుండగా సడెన్‌గా ట్రైన్ వచ్చింది. వెంటనే ప్లాట్‌ఫామ్ పైకి దూకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు.