ఈతకు వెళ్లి బాలుడి మృతి
PLD: చిలకలూరిపేటలో విషాదం జరిగింది. సుభాని నగర్‌కు చెందిన చందు అనే ఐదో తరగతి విద్యార్థి వాగులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. నీటి లోతు తెలియక ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో నీటిలోంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.