నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు

నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు

TG: జిన్నింగ్‌‌ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో ఇవాళ్టి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరగనుంది. రైతులపై భారం తగ్గించేందుకు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్‌ను ఎకరానికి 6.72 నుంచి 10 క్వింటాళ్లకు పెంచేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.