భక్తి శ్రద్ధలతో ఘనంగా మారమ్మ దేవి జాతర వేడుకలు

భక్తి శ్రద్ధలతో ఘనంగా మారమ్మ దేవి జాతర వేడుకలు

ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని మారమ్మ దేవి జాతర వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఆర్డీటీ హాస్పిటల్ సమీపాన వెలసిన మారమ్మ దేవికి ఉదయాన్నే పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. కలశాలు చేతపట్టి మహిళలు ఆలయం వరకు ఊరేగింపు చేపట్టారు.