రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి అక్రమ రవాణాను అడ్డుకోవడం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆదివారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, (RC), పొల్యూషన్, ఇన్సూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.