VIDEO: "HIT TV కథనానికి స్పందన"
SRPT: సిరిపురం నుంచి చాకిరాల వెళ్లే మార్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన బీటీ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. 'కోతకు గురైన రూ.2.30 కోట్ల రోడ్డు' అనే శీర్షికతో ఇటీవల HIT TV లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు తక్షణం స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన రహదారికి మరమ్మతులు పూర్తి చేయడంతో ప్రయాణికులు, వాహనదారులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.