జాతీయ రహదరి పై రోడ్డు ప్రమాదం

SKLM: పలాస మండలం కొబ్బరిఊరు గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధి హామీ పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.