VIDEO: ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు అస్వస్థత

VIDEO: ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు అస్వస్థత

GDWL: ఇటిక్యాల మండలం ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌లో శుక్రవారం రాత్రి కలుషిత ఆహారం తిని సుమారు 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించింది. రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. ​వెంటనే వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్డీవో అలివేలు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.