SVUలో ఏప్రిల్ 15 నుంచి పరీక్షలు

SVUలో ఏప్రిల్ 15 నుంచి పరీక్షలు

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed, B.P.Ed, D.P.Ed నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 18 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటి కళాశాలలతో పాటు రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.