మీ కోసం కార్యక్రమం ఈ నెల 13కి వాయిదా: జిల్లా కలెక్టర్

ప్రకాశం: ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 12న జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని 13వ తేదీకి మార్పు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా స్పష్టం చేశారు.12న డీఆర్సీ సమావేశం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.