ప్రమాదాల బారిన పడకుండా హ్యాండ్ గ్లౌజులు అందజేత
E.G: గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు, హెల్పర్ అర్జున్‌కు జనసేన పార్టీ నాయకులు నవ వాసి విష్ణు ఆధ్వర్యంలో హ్యాండ్ గ్లౌజులు మంగళవారం అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడినప్పుడు గ్లౌజులు వాడడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటుందని జనసేన నాయకులు తెలిపారు.