పెరిగిన ఎండ తీవ్రత ఆందోళనలో ప్రజలు

పెరిగిన ఎండ తీవ్రత ఆందోళనలో ప్రజలు

PLD: మాచవరం మండలంలో గత కొద్ది రోజులుగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకు తీవ్ర ఎండ తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఉష్ణోగ్రత 38 నుంచి 40 డిగ్రీలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని వైద్యులు చూపిస్తున్నారు. అలాగే బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.