'ప్రశాంతంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకోవాలి'

VZM: కృష్ణాష్టమి పండగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాజాం సీఐ ఆశోక్ కుమార్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కృష్ణాష్టమి రోజున వేడుకలు, ఉట్టికొట్టి కార్యక్రమం నిర్వహించినట్లైతే ముందుగానే పోలీస్ స్టేషన్‌లో అనుమతులు తీసుకోవాలన్నారు. గొడవలు, అల్లర్లు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.