అనుగొండకు బస్సు సర్వీస్ నడపాలని ధర్నా
NRPT: మక్తల్ మండలం అనుగొండ గ్రామానికి బస్సు సర్వీస్‌ను నడపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దానాపూర్ స్టేజి దగ్గర విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాలు నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి బస్సు సౌకర్యం లేక నిత్యం విద్యార్థులు కాలినడకన పాఠశాలకు వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠశాల సమయానికి బస్సులు నడపాలని వారు కోరారు.