VIDEO: సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

BDK: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ..కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో..బుధవారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. జీతాలు పెంచుతామని యజమాన్యం ప్రకటన చేసి నేటికి సంవత్సరం గడిచిన పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యం దీనిపై స్పందించాలని కోరారు.