'ఎరువులు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు'

'ఎరువులు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు'

KMM: ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. బోన‌క‌ల్లు మండలంలోని బోనకల్లు, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లోని సహకార సంఘాల ఎరువుల దుకాణాలను బుధవారం ఆయ‌న తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లోని నిల్వ‌ల‌ను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.