ఎస్పీను కలిసిన తంతోలి గ్రామస్థులు

ఎస్పీను కలిసిన తంతోలి గ్రామస్థులు

ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను తంతోలి గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు, జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని వారు కోరారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సర్పంచులు తమ వంతు కృషి చేయాలని సూచించారు.