సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
E.G: నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో రూ.28 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం అసిస్టెంట్ ఇంజనీర్ నాగేంద్ర పరిశీలించారు. పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆయన ఆదేశించారు. అభివృద్ధి కోసం ఈ సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి దుర్గేశ్‌కు కూటమి శ్రేణులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.