పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది. కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-మెదక్, కాచిగూడ-నిజామాబాద్, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి, మెదక్-కాచిగూడ, గురువారం నిజామాబాద్-కాచిగూడ సర్వీసును రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.