దళారీలకు పంటను అమ్మవద్దు
SDPT: దళారులకు రైతులు తమ పంటలను అమ్మి నష్టపోవద్దని మెదక్ MP రఘునందన్ రావు సూచించారు. గజ్వేల్ మండలం పిడిచెడ్లోని సాయిబాలాజీ కాటన్ మిల్లులో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. రైతులకు పూర్తి సహకారం అందించాలని, దళారులకు సపోర్ట్ చేసే అధికారులు సెలవు పెట్టి వెళ్లాలని హెచ్చరించారు.