గంజాయి కేసులో 10 మంది అరెస్ట్

గంజాయి కేసులో 10 మంది అరెస్ట్

SKLM: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ఎం.అవతారం, ఎస్సై చిరంజీవి తెలిపారు. సోమవారం జె.ఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పైడి భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న 10 మందిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.