'మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి'
VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలో PPP విధానాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని CPI జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌లు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా CPI ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక RTC కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిరసన కార్యక్రమం చేపట్టారు.