హత్య కేసులో నిందితుడి అరెస్ట్
NTR: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు సాయిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఈ ఘటన చోటు చేసుకుందని నందిగామ ఏసీపీ తిలక్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడు సాయి గతంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పలు కేసుల్లో ముద్దాయి.