యువ కాంగ్రెస్ నేత ఆర్థిక సహాయం
MBNR: పేదింటి మైనార్టీ ఆడబిడ్డ వివాహానికి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అప్పన్నపల్లికి చెందిన యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మల్ శ్రీను ఇవాళ రూ. 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వార్డుకు చెందిన మహమ్మద్ లాల్ పాషా కూతురు వివాహం ఈనెల 13వ తేదీన ఉండగా, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న శ్రీను ఆర్థిక సహాయం అందజేశారు.