మహిళలు, చిన్నారుల రక్షణకై పోలీస్ అక్క కార్యక్రమం: SP

మహిళలు, చిన్నారుల రక్షణకై పోలీస్ అక్క కార్యక్రమం: SP

ADB: మహిళలు, చిన్నారుల రక్షణకై ప్రారంభించబడిన 'పోలీసు అక్క' అనే కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోందని SP అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో పోలీస్ అక్క సిబ్బందితో గురువారం సమావేశమై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రజలచే విశేష ఆదరణ పొందుతున్న పోలీస్ అక్క సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.