'ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది'
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వెంగల్ రావు నగర్ డివిజన్ పరిధిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.