మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు: మాజీ మంత్రి
CTR: విజయపురం మండలం ఇల్లత్తూరులో ఆదివారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదమని తెలిపారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని ఆమె హెచ్చరించారు.