కంగ్టి జాతరలో కుస్తీ మే సవాల్
SRD: కంగ్టి జాతర ఉత్సవాల్లో కుస్తీ మే సవాల్ పోటీలు శనివారం రసవత్తరంగా జరిగాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మల్ల యోధులు తరలివచ్చి మైదానంలో పోటీకి దిగారు. ఎండోమెంట్ కార్యనిర్వాహణ అధికారి పర్యవేక్షణలో పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. మల్ల యోధులు కుస్తీ మే సవాల్ అంటూ పోటీకి దిగడంతో మైదానం సందడి నెలకొంది. గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు.