భర్తల స్థానంలో భార్యలు గెలుపు
వరంగల్: నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గతంలో కౌన్సిలర్లుగా గెలిచిన భర్తల స్థానంలో ఈసారి భార్యలు విజయం సాధించారు. 26వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీదేవి గెలుపొందగా, గత ఎన్నికల్లో ఆమె భర్త శ్రీనివాస్ కౌన్సిలర్‌గా ఉన్నారు. 29వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంధ్య విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో ఆమె భర్త సాంబయ్య గెలిచారు.