T20 వరల్డ్ కప్.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!

T20 వరల్డ్ కప్.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!

నిన్న విడుదలైన ICC T20 WC 2026 షెడ్యూల్ ప్రకారం టోర్నీకి మొత్తం 8 గ్రౌండ్స్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఇందుకు భారత్‌లోని అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై మైదానాలను ఎంపిక చేసిన BCCI తెలుగు రాష్ట్రాలను పట్టించుకోలేదు. TGలో ఉప్పల్, APలో విశాఖ మైదానాలు ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు. ఇది అన్యాయమంటూ దక్షిణాది క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.