కుల్దీప్‌పై రిషభ్ పంత్ ఆగ్రహం!
టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇది నీ ఇల్లు కాదు.. త్వరగా బౌలింగ్ చేయి' అని అన్నాడు. SAతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో బౌలింగ్ వేసేందుకు కుల్దీప్ ఎక్కువ సమయం తీసుకోవడంతో పంత్.. అతన్ని మందలించాడు. పంత్ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ కావడంతో ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.