లారీ ప్రమాదంలో బాలుడు మృతి
PLD: 7 ఏళ్ల రూవ్వ మహేష్ దాచేపల్లి బస్టాండ్‌లో లారీ ఢీకొని మృతిచెందాడు. జ్వరంతో బాధపడుతున్న మహేష్‌ను అమ్మమ్మ తీసుకొచ్చింది. రోడ్డు దాటుతుండగా, అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. తండ్రి గోపి 4 ఏళ్ల క్రితం మృతిచెందగా, తల్లి నందిని దాచేపల్లిలో పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.