VIDEO: 'మహిళలకు అన్యాయం చేస్తే చరిత్రలో మిగిలిపోతారు'
NLR: మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చి పట్టణంలో మెప్మాలోని 9 పొదుపు సంఘాలకు కోటి 80 లక్షల రూపాయల చెక్‌లను అందజేసి ఆమె మాట్లాడారు. మహిళలను అన్యాయం చేయాలనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్ మహిళల బిల్లును కొంతమంది వ్యతిరేకించారు. వారందరూ మహిళలకు అన్యాయం చేసే వాళ్లుగా చరిత్రలో మిగిలిపోతారని మండిపడ్డారు.